: యాపిల్ పై రూ. 2,290 కోట్ల జరిమానా
ఇటలీకి కట్టాల్సిన పన్ను ఎగ్గొట్టేందుకు అక్రమ మార్గంలో నిధులను ఐర్లాండ్ కు తరలించారన్న ఆరోపణలపై అమెరికన్ మల్టీ నేషనల్ టెక్ దిగ్గజం యాపిల్ పై 347 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,290 కోట్లు) జరిమానాను ఇటలీ ప్రభుత్వం విధించింది. తప్పు చేసిన యాపిల్ జరిమానాను చెల్లించేందుకు అంగీకరించిందని ఇటలీ దినపత్రిక 'లా రిపబ్లికా' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 2008 నుంచి 2013 మధ్య సంస్థ లెక్కల్లో అవకతవకలు ఉన్నాయని నిర్ధారించిన ఇటలీ న్యాయమూర్తులు దాదాపు ఏడాదిన్నర పాటు కేసును విచారించారు. మొత్తం 962 మిలియన్ డాలర్లను దేశం దాటించారన్నది యాపిల్ పై ఉన్న ఆరోపణ.