: ఇక పాము వంతు!... గుంటూరు ఆసుపత్రిలో పామును చూసి రోగుల పరుగు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సుదీర్ఘ కాలంగా మకాం పెట్టిన ఎలుకలు ఓ చిన్నారిని పీక్కుతిన్న ఘటన రాష్ట్రం, దేశంలోనే కాక విశ్వవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పలు అంతర్జాతీయ పత్రికలు ఈ ఘటనకు సంబంధించిన కథనాలను ఫొటో సహా ప్రముఖంగా ప్రచురించాయి. అప్పటికప్పుడు రంగంలోకి దిగిన ఏపీ సర్కారు ఆసుపత్రి వైద్యాధికారులపై కొరడా ఝుళిపించింది. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి మూషికాలను వెళ్లగొట్టేందుకు పెద్ద కసరత్తే జరిగింది. తాజాగా నేటి ఉదయం ఓ పాము గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యక్షమై కలకలం రేపింది. ఆసుపత్రిలో పామును చూసిన రోగులు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న వైద్యులు, అధికారులు పాములను పట్టే వ్యక్తులను రంగంలోకి దింపారు. ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్ విభాగంలోకి పాము వెళ్లిందని రోగులు చెప్పడంతో అందులో పాములోళ్లు అంగుళం కూడా వదలకుండా తనిఖీలు చేస్తున్నారు.