: విద్యాబాలన్ కిడ్నీలో రాయి?... విదేశీ ట్రిప్ ను రద్దు చేసుకుని ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ హీరోయిన్


బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ నిన్న తీవ్ర నొప్పితో సతమతమైంది. భర్త సిద్ధార్థ రాయ్ కపూర్ తో కలిసి న్యూ ఇయర్ ఆగమనాన్ని, తన జన్మదిన వేడుకను జరుపుకునేందుకు ఆమె విదేశాల్లోని ఓ సుందర ప్రదేశానికి బయలుదేరింది. ముంబై నుంచి బయలుదేరిన నిన్న రాత్రికి ఆ జంట అబుదాబీ చేరుకుంది. మరికాసేపట్లో వారు తాము నిర్ణయించుకున్న ప్రదేశానికి వెళ్లేందుకు మరో విమానాన్ని ఎక్కాల్సి ఉంది. అయితే సడెన్ గా విద్యాబాలన్ వెనుక భాగంలో తీవ్రమైన నొప్పితో సతమతమైంది. భరించలేని నొప్పి కారణంగా అబుదాబి ఎయిర్ పోర్టులోనే ప్రథమ చికిత్స తీసుకోగా, ఆసుపత్రికి వెళితేనే మేలని అక్కడి వైద్యులు ఆమెకు చెప్పారు. దీంతో తమ విదేశీ ట్రిప్ ను రద్దు చేసుకున్న ఆ జంట, తిరిగి ముంబై ఫ్లైట్ ఎక్కేసింది. నిన్న రాత్రి ముంబైలో విమానం దిగిన వెంటనే విద్యబాలన్ ఖర్ హిందూజా ఆసుపత్రికి వెళ్లిపోయింది. కొన్ని పరీక్షలు చేసిన అక్కడి వైద్యులు విద్యాబాలన్ కిడ్నీలో రాయి ఉన్నట్లు నిర్ధారించారు. మరిన్ని పరీక్షల తర్వాత విద్యాబాలన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ కానున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News