: రహేజా భూముల వ్యవహారంలో పలువురు ఐఏఎస్ లకు సమన్లు
రహేజా భూముల వ్యవహారంపై న్యాయవాది శ్రీరంగారావు దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు ఇవాళ విచారణకు స్వీకరించింది. పలువురు ఐఏఎస్ లు, ఓ ఐపీఎస్ అధికారి, రహేజా ప్రతినిధులకు సమన్లు జారీ చేసింది. వారిలో ఐఏఎస్ లు రత్నప్రభ, బీపీ ఆచార్య, పీఎస్ మూర్తి, సుబ్రమణ్యం, ఐపీఎస్ గోపీకృష్ణ ఉన్నారు. రహేజా ప్రతినిధుల్లో నీల్ రహేజా, రవీంద్రనాథ్ ఉన్నారు. ఫిబ్రవరి 12న కోర్టుకు హాజరుకావాలని వారిని కోర్టు ఆదేశించింది. వారందరిపై ఐపీసీ 409, 420, పీడీ యాక్ట్ 11, 12, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.