: పౌల్ట్రీ ఫాంలో గబ్బర్ సింగ్ నిర్మాత!
నాటి కమెడియన్, నేటి నిర్మాత బండ్ల గణేష్ ఈ మధ్య కాలంలో అభిమానులకు కనిపించలేదు. ఆడియో ఫంక్షన్లకు హాజరు కావడం లేదు. మరి ఏమి చేస్తున్నారనుకుంటున్నారు!... శంషాబాద్ ప్రాంతంలో ఆయనకు కోళ్ల ఫారాలు ఉన్నాయి. అక్కడి పనులలో బిజీగా ఉన్నారు. తాజాగా అక్కడ ఉన్న ఒక పౌల్ట్రీ ఫాంలో బండ్ల గణేశ్ దర్శనమిచ్చాడు. కోడిగుడ్లను ఏరి, వాటిని ట్రేలో పెడుతున్న గణేశ్ ను చూసి స్థానికులు ఒకింత ఆశ్చర్యపోయారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేయడంతో ఆయన అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.