: రక్షించమని వేడుకుంటే... నవ్వేసి, అకృత్యాన్ని సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు!: ‘ఇన్ఫోసిస్’ బాధితురాలి వేదన


దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లో నిన్న వెలుగుచూసిన లైంగిక దాడి ఘటనకు సంబంధించి బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఓ దుర్మార్గుడు తనపై అకృత్యానికి పాల్పడుతుంటే, తన అరుపులు విని అక్కడికి వచ్చిన మరో దుర్మార్గుడు తనను రక్షించకపోగా, వికటాట్టహాసం చేసి మొత్తం దారుణాన్ని తన సెల్ ఫోన్ లో రికార్డు చేశాడని ఆమె వాపోయింది. ఇన్ఫోసిస్ కు చెందిన పూణే కేంపస్ లోని క్యాంటిన్ క్యాషియర్ గా పనిచేస్తున్న యువతి సాయంత్రం వాష్ రూమ్ కు వెళ్లగా, అక్కడ క్లీనర్ గా పనిచేస్తున్న పరితోశ్ బాగ్ ఆమెను అనుసరించి, అఘాయిత్యానికి ఒడిగట్టాడు. వాష్ రూమ్ లోనే తనపై పరితోష్ చేస్తున్న దాడితో తాను గట్టిగా కేకలు వేయగా, అక్కడికి వచ్చిన ప్రకాశ్ మహాదిక్ తనను కాపాడకపోగా వికటాట్టహాసం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అంతటితో ఆగని ప్రకాశ్ వాష్ రూమ్ డోర్ ను లోపలి నుంచి గడియ పెట్టి, తన జేబులోని సెల్ ఫోన్ తీసి మొత్తం దారుణాన్ని చిత్రీకరించాడని తెలిపింది. ఈ విషయాన్ని ఎక్కడైనా బయటకు చెబితే, సదరు వీడియోను సోషల్ మీడియాలో పెట్టేస్తామని బెదిరించారని ఫిర్యాదు చేసింది. 115 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఇన్ఫోసిస్ కేంపస్ లో ఈ నెల 27న చోటుచేసుకున్న ఈ దారుణం నిన్న వెలుగు చూసింది.

  • Loading...

More Telugu News