: ఏపీలో 12 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో తాజాగా 12 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. నర్సీపట్నం ఏఎస్పీగా ఐశ్వర్య రస్తోగీ, రంపడచోడవరం ఏఎస్పీగా నయీం అస్మి, సీఐడీ ఏఎస్పీగా ఎన్.శ్వేత, పాడేరు ఏఎస్పీగా శశికుమార్, కడప అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా బి.సత్య ఏసుబాబు నియమితులయ్యారు. గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్ గా కె.ఫకీరప్ప, నర్సీపట్నం అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) గా బాబూజీ, విజయనగరం అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) గా సీహెచ్.వెంకట అప్పలనాయుడు, చిత్తూరు పరిపాలన అదనపు ఎస్పీగా అభిషేక్ మొహంతి నియమితులయ్యారు. డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని విజయరావు, రాహుల్ దేవ్ శర్మ, విశాల్ కు ఆదేశాలు ఇచ్చారు.