: 'కిల్లింగ్ వీరప్పన్' విడుదలపై స్టేకు మద్రాస్ హైకోర్టు నిరాకరణ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కిల్లింగ్ వీరప్పన్' విడుదలకు అడ్డంకి తొలగింది. ఈ చిత్రం విడుదలపై స్టే విధించేందుకు మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో జనవరి 1న థియేటర్లలో విడుదల కాబోతుంది. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన పన్నీర్ సెల్వి అనే మహిళ ఈ సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విడుదల నిలిపివేయాలని పిటిషన్ వేసింది. అయితే సినిమా విడుదలపై స్టే ఇవ్వడానికి న్యాయమూర్తి తిరస్కరించారు. దాంతో తదుపరి విచారణను జనవరి 4కి వాయిదా వేశారు.