: బీహార్ లో జంగిల్ రాజ్ నిజంగానే వచ్చేసింది!...బీజేపీ మాజీ ఎమ్మెల్యేను కొట్టి కారెత్తుకెళ్లిన దుండగులు
గూండారాజ్ రాజ్యంగా పేరుగాంచిన బీహార్ లో మళ్లీ జంగిల్ రాజ్ ఎంటరైపోయింది. ఇప్పటికే ముగ్గురు ఇంజినీర్లు దారుణ హత్యకు గురయ్యారు. మరో నలుగురు వ్యక్తులు కూడా ఆది, సోమవారాల్లో హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రికి ఆ రాష్ట్రంలో నాలుగు రోజుల్లోనే హత్యకు గురైన వారి సంఖ్య ఏడుకు చేరింది. దీంతో నితీశ్ సర్కారు కంటే ముందు రాష్ట్రంలో స్వైర విహారం చేసిన జంగిల్ రాజ్ పదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఎంటరైందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిన్న రాత్రి బీహర్ లోని మాసౌరీ జిల్లాలో బీజేపీ నేత, ఆ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యేపై దాడికి దిగిన దుండగులు ఆయన కారును ఎత్తుకెళ్లారు. నేటి ఉదయం వెలుగుచూసిన ఈ ఘటన రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగానూ పెద్ద చర్చకు తెర తీసింది.