: విశాఖలో కొత్త సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు... ఒంటిగంట వరకే అనుమతి
విశాఖ పోలీసులు కొత్త సంవత్సర వేడుకలపై కఠిన ఆంక్షలు విధించారు. ఈ నెల 31 రాత్రి 9 గంటల నుంచి ఒంటిగంట వరకే వేడుకలు జరుపుకోవాలని సూచించారు. పబ్బులు, స్టార్ హోటళ్లు, బార్ లు అర్ధరాత్రి ఒకటి వరకు నడపాలని ఆదేశించారు. వేడుకల్లో అశ్లీల నృత్యాలు చేయిస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మైనర్లు డ్రింక్ చేసినా, అసభ్యకర నృత్యాలు చేసినా ఆయా హోటల్ యజమాన్యాలే బాధ్యత వహించాలని చెప్పారు. మరోవైపు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్యాగుల్లో ఆయుధాలు తెచ్చే ప్రమాదం ఉన్నందున బ్యాగ్ స్కానర్ తో తనిఖీలు చేస్తామని విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ త్రివక్రమ్ వర్మ తెలిపారు. మరోవైపు బస్టాండ్లు, రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టు, ఫిషింగ్ హార్బర్ లో కూడా భద్రతను పెంచారు.