: విడాకుల సమయంలో లాటరీ...వాటా కావాలంటున్న భర్త... కుదరదన్న కోర్టు


విడాకుల సమయంలో భార్యకు తగిలిన లాటరీలో వాటా కావాలని ఓ భర్త చేసిన డిమాండ్ ను ఆమ్ స్టర్ డ్యామ్ డిస్ట్రిక్ కోర్టు తిరస్కరించింది. వివరాల్లోకి వెళ్తే...నెదర్లాండ్స్ రాజధాని ఆమ్ స్టర్ డామ్ లో 2014 అక్టోబర్ 20న ఓ జంట విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఆ సమయంలోనే ఇద్దరూ పంచుకోవాల్సిన ఆస్తుల జాబితాను కూడా న్యాయస్థానానికి వారు అందించారు. వీరి విడాకులపై విచారణ జరిపిన న్యాయస్ధానం వారికి 2015 జూన్ లో వారు కోరినట్టే విడాకులు మంజూరు చేసింది. అయితే 2015 జనవరి 1న ఆమెకు భారీ లాటరీ తగిలింది. దీంతో ఆమెకు తగిలిన లాటరీ తన డబ్బుతో కొన్నదేనని అందువల్ల తనకు సగం వాటా చెందుతుందని, తన వాటా తనకు ఇప్పించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం విడాకులకు పూర్వం నాలుగేళ్ల నుంచి వారిరువురూ విడివిడిగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకుంటున్నారని గుర్తించింది. దీంతో లాటరీ డబ్బులో ఒక్క పైసా కూడా భర్తకు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చిచెప్పింది.

  • Loading...

More Telugu News