: తీరు మార్చుకోకుంటే జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు: జేసీ దివాకర్ రెడ్డి


అనంతపురం జిల్లాలో ఇవాళ చేపట్టిన 'నీరు-ప్రగతి' కార్యక్రమంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు. తీరు మార్చుకోకున్నా, రాయలసీమకు నీళ్లు వద్దన్నా జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడన్నారు. మంచి పనులు చేస్తేనే జగన్ సీఎం అయ్యే అవకాశముందని చెప్పారు. కానీ పొద్దున లేచిన దగ్గర నుంచి చంద్రబాబును తిట్టేందుకే ఆయనకు సమయం సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. సీఎంకు చెడ్డపేరు తేవాలన్న ఒకే లక్ష్యంతో జగన్ పని చేస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు విజన్ ఉన్న వ్యక్తి అని, రాయలసీమకు శ్రీశైలం నుంచి నీళ్లు తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. అందరికీ మనుమడు, మనవరాళ్లతో ఆడుకోవాలని సరదాగా ఉంటుందని, కానీ చంద్రబాబు మాత్రం వాటిని పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం పాటుపడుతున్నారని జేసీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News