: పాక్ ఐఎస్ఐకి సహకరిస్తున్న ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారి అరెస్ట్
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి సహకరిస్తున్నాడన్న ఆరోపణలతో భారత వాయుసేనలో గతంలో విధులు నిర్వహించిన అధికారి రంజిత్ సింగ్ ను అదుపులోకి తీసుకోవడం సంచలనం కలిగించింది. ఈ ఉదయం పంజాబ్ లో రంజిత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను ప్రస్తుతం విచారిస్తున్నారు. గతంలో రంజిత్ పలు రహస్యాలను ఐఎస్ఐకి చేరవేసినట్టు ఆధారాలు సేకరించిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఆ సమాచారాన్ని ఢిల్లీ పోలీసులకు చేరవేయగా, పంజాబ్ పోలీసుల సహకారంతో రంజిత్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా, గత వారంలో జమ్మూకాశ్మీర్ కు చెందిన ఓ టీచర్ ను కూడా ఇదే విధమైన ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.