: కేజ్రీ వాల్ పార్టీ నేత దారుణ హత్య... పార్టీకని వెళ్లి ఇంటి వద్దే శవమై తేలిన వైనం


ఢిల్లీలో సంచలన విజయాలు నమోదు చేసి ఏడాది వ్యవధిలో ఢిల్లీ సీఎం పీఠాన్ని రెండు సార్లు కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి నిన్న భారీ షాక్ తగిలింది. పార్టీ పూర్వాంచల్ జిల్లా అధ్యక్షుడు ధీరేంద్ర ఈశ్వర్ నిన్న ఉదయం తన ఇంటికి వంద మీటర్ల దూరంలో శవమై కనిపించారు. ఆదివారం సాయంత్రం పార్టీకని చెప్పి వెళ్లిన ధీరేంద్ర ఆ రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. అయితే సోమవారం తెల్లవారిన తర్వాత ఢిల్లీ శివారులోని బేగంపూర్ లోని తన ఇంటికి సమీపంలో అతడి శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు శవం ధీరేంద్రదేనని నిర్ధారించారు. అయితే హత్య జరిగిన కారణాలు మాత్రం తెలియరాలేదు. ధీరేంద్ర జననాంగాలు కోసేసి, ముఖాన్ని చిదిమేసిన దుండగులు అతడి శరీరంపై కత్తులతో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. శవం పడి ఉన్న స్థలంలోనే హత్య జరిగిందా?, లేక ఎక్కడైనా చంపేసి అక్కడ పడేశారా? అన్న విషయాలు తెలియరాలేదు. అంతేకాక ఈ హత్య వెనుక ఉన్న కారణాలు కూడా తెలియరాలేదు. తానుంటున్న ఏరియాలోనే ఇటీవల యోగా కేంద్రాన్ని ప్రారంభించిన ధీరేంద్ర, వెనువెంటనే దానిని మూసేశారు. స్థల వివాదం నేపథ్యంలోనే ఆయన తన యోగా కేంద్రాన్ని మూసేసినట్లు తెలుస్తోంది. హత్యకు గల కారణాలను నిగ్గు తేల్చేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News