: కాంగ్రెస్ నేత విగ్రహానికి పూలమాల వేసిన టీఆర్ఎస్ ఎంపీ కవిత
కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ బద్ధ శత్రువుగా భావిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎల్సీ నేత, అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అయిన దివంగత పి.జనార్దన్ రెడ్డి (పీజేఆర్) విగ్రహానికి టీఆర్ఎస్ ఎంపీ కవిత పూలమాల వేసి నివాళి అర్పించారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఉన్న పీజేఆర్ విగ్రహానికి ఆమె అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బతికినంత కాలం పేదల అభ్యున్నతి కోసం తపించిన నేత పీజేఆర్ అని కొనియాడారు. ఆయన ఆశలను, ఆశయాలను టీఆర్ఎస్ పార్టీ నెరవేరుస్తుందని చెప్పారు.