: ప్రణబ్ జీ! హ్యాపీ న్యూ ఇయర్.. ఆనందంగా ఉండాలి: ఒబామా


భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి యూఎస్ అధ్యక్షుడు బరాక్ ఒబామా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక గ్రీటింగ్ కార్డును పంపించారు. ప్రణబ్ ఆయురారోగ్యాలతో జీవించాలని, హాలి డే సీజన్ ఆనందంగా గడపాలని ఒబామా ఆకాంక్షించారు. ఒబామా పంపిన ఈ గ్రీటింగ్ కార్డులో ఆయన కుటుంబ సభ్యుల సంతకాలతో పాటు వారి రెండు పెంపుడు శునకాల పాదముద్రలు కూడా వేశారు. కాగా, పోర్చుగీస్ వాటర్ శునకాలు బో, సన్నీలు గత కొన్నేళ్లుగా ఒబామా కుటుంబంలో చేరిపోయాయి.

  • Loading...

More Telugu News