: రాజ్ కోట్ జట్టుకు కోచ్ గా గ్యారీ కిర్ స్టెన్?
కోచ్ గా టీమిండియాపై తనదైన ముద్ర వేసిన గ్యారీ కిర్ స్టెన్ ఐపీఎల్ లోకి కొత్తగా వచ్చిన రాజ్ కోట్ జట్టుకు మళ్లీ కోచ్ గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాజ్ కోట్ యాజమాన్యం కిర్ స్టెన్ తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఢిల్లీ డేర్ డెవిల్స్ కోచ్ గా ఉన్న ఆయనను ఆ ఫ్రాంఛైజీ యాజమాన్యం ఇటీవల తొలగించింది. ఈ నేపథ్యంలో గ్యారీ సేవలను పొందేందుకు రాజ్ కోట్ యాజమాన్యం ఆసక్తి చూపుతోంది. 2011లో ప్రపంచకప్ ను భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన గ్యారీ... టీ20 ఫార్మాట్ లో మాత్రం అనుకున్న ఫలితాలను సాధించలేకపోయారు. గ్యారీ కోచ్ గా ఉన్న ఢిల్లీ జట్టు గత రెండు సీజన్లలో పైఫల్యం చెందింది.