: కరాటే నైపుణ్యం చూపించబోయి గాయాలపాలైన కృష్ణాష్టమి హీరోయిన్ నిక్కీ గర్లానీ!


సునీల్ హీరోగా నటించిన తాజా చిత్రం 'కృష్ణాష్టమి'లో నటించిన నిక్కీ గర్లానీకి ఓ తమిళ చిత్రం షూటింగులో గాయాలయ్యాయి. విష్ణు విశాల్ హీరోగా ఉన్న చిత్రంలో నిక్కీ మహిళా పోలీసు అధికారిగా నటిస్తోంది. ఓ యాక్షన్ సీన్ లో భాగంగా కరాటే దృశ్యాలను చిత్రీకరిస్తున్న సందర్భంగా డూప్ ను వద్దని, తానే స్వయంగా స్టంట్స్ చేయడంతో కుడి చేతికి గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే యూనిట్ సభ్యులు ఆమెకు చికిత్స చేయించారు. ఇక పోలీసు పాత్రంటే ఆ మాత్రం యాక్షన్ చేయకుంటే ఇంకెందుకు, నాకేం కాలేదులే అంటూ నవ్వుతోందట. ఇంతకీ గాయం ఎలా అయిందో చెప్పలేదు కదూ? ఒంటి చేత్తో స్లాబులను పగులగొట్టే సీనులోనట. ఓ స్లాబ్ ను ఆత్మవిశ్వాసంతో పగులగొట్టిన ఆమె, రెండో దాని దగ్గరకు వచ్చేసరికి విఫలమై గాయాలపాలైంది.

  • Loading...

More Telugu News