: ఎండలో నిలబడి శిక్ష విధించుకున్న జెడ్పీ చైర్మన్!


ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు తనను తాను మళ్లీ శిక్షించుకున్నారు. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం జెడ్పీ హై స్కూల్ తనిఖీ నిమిత్తం సోమవారం ఆయన వెళ్లారు. ఆ పాఠశాలలో 15 మంది టీచర్లకు బదులు కేవలం 5 గురు మాత్రమే హాజరయ్యారు. టీచర్లు రాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నైతికబాధ్యత వహిస్తూ తనకు తాను శిక్ష విధించుకోవాలని నిర్ణయించుకున్న ఆయన సుమారు పది నిమిషాల పాటు ఎండలో నిలబడ్డారు. కాగా, హరిబాబు ఈ విధంగా తనకు తాను శిక్ష విధించుకోవడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఒకసారి ఆయన ఈవిధంగానే శిక్ష విధించుకున్నారు. ప్రభుత్వ వాహనాన్ని హరిబాబు సొంత అవసరాలకు వినియోగించుకున్నారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించిన సందర్భంలో..తాను తప్పుచేశానంటూ పదినిమిషాల పాటు ఎండలో నిలబడ్డారు.

  • Loading...

More Telugu News