: చంద్రబాబుతో జపాన్ బృందం భేటీ... పలు ఒప్పందాలపై సంతకాలు
జపాన్ నుంచి వచ్చిన ప్రత్యేక ప్రతినిధుల బృందంతో సమావేశమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పలు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ ఉదయం మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్లతో సమావేశమైన అనంతరం చంద్రబాబు హుటాహుటిన విజయవాడ బయలుదేరి వెళ్లారు. అప్పటికే విజయవాడ చేరుకున్న జపాన్, తయోమో గవర్నర్ తక కసుయిషీ నేతృత్వంలోని బృందంతో చంద్రబాబు, ఇతర మంత్రులు సమావేశమయ్యారు. పలు రంగాల్లో జపాన్ సహకారంపై చర్చించిన వీరు, ఫార్మా, టూరిజం, ఫిషరీస్ విభాగంలో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధికి జపాన్ పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రావడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు.