: బ్రిటన్ లో సొంత పార్టీ స్థాపించిన భారతీయుడు


బ్రిటన్ లో మరో భారత సంతతి వ్యక్తి సత్తా చాటాడు. ఏకంగా ఒక రాజకీయ పార్టీనే స్థాపించాడు. ఇప్పటిదాకా తాను పనిచేసిన యూకే ఇండిపెండెన్స్ పార్టీ (యూకేఐపీ) ఇమిగ్రేషన్ విధానం నచ్చకపోవడంతో హర్భజన్ సింగ్ సొంత పార్టీని స్థాపించాడు. ఓపెన్ బోర్డర్స్ పార్టీ (ఓబీపీ) పేరుతో పార్టీని నెలకొల్పాడు. బర్మింగ్ హామ్ లోని పెర్రీబార్ నియోజకవర్గ ఎంపీగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త పార్టీ స్థాపించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోకి అందరికీ ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేశారు. అంటు వ్యాధులు లేని వారిని, నేర చరిత్ర లేని వారిని స్వేచ్ఛగా దేశంలోకి అనుమతించాలని హర్భజన్ డిమాండ్ చేశారు. దీంతో, ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News