: జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలను అడ్డుకోలేం: సుప్రీంకోర్టు


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సమస్య తీవ్రతను గుర్తించామని, అయితే ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించాలని పిటిషన్ దారునికి సూచించింది. జీహెచ్ఎంసీలో 7.9 లక్షల ఓట్లను తొలగించారంటూ హైదరాబాద్ కు చెందిన మహేశ్ అనే వ్యక్తి పిటిషన్ వేశాడు. ఓట్ల తొలగింపుపై పూర్తి విచారణ జరిపేవరకు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News