: ఇండియాలోనే తొలిసారి... నేటి నుంచి ఆర్జీఐఏలో ఈ-బోర్డింగ్ సదుపాయం
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ)లో ఎలక్ట్రానిక్ బోర్డింగ్ విధానం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. కేంద్ర సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఈ-బోర్డింగ్ సేవలను ప్రారంభించనున్నారు. ఇండియాలో ఈ-బోర్డింగ్ సేవలను అందించాలని నిర్ణయించిన మొట్ట మొదటి ఎయిర్ పోర్టు శంషాబాద్ ఆర్జీఐఏ కావడం విశేషం. ఈ సేవలు అందుబాటులోకి వస్తే, దేశవాళీ విమానాల ప్రయాణ సమయానికి 45 నిమిషాల ముందు బోర్డింగ్ పాస్ తీసుకోవాల్సిన అవసరం ఉండబోదు. పావు గంట ముందు కూడా ఎయిర్ పోర్టుకు చేరుకుని ప్రయాణం సాగించే సదుపాయం ప్రయాణికులకు దగ్గరవుతుంది.