: కాబూల్ ఎయిర్ పోర్టుపై బాంబు దాడి... గంటల వ్యవధిలో రెండు చోట్ల ముష్కరుల దాడులు


అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. కేవలం గంటల వ్యవధిలో ఆ దేశంలో రెండు బాంబు దాడులకు దిగి అప్ఘన్ సర్కారుకు సవాల్ విసిరారు. నిన్న హెల్మంద్ రాష్ట్రంలోని లస్కర్ ఘాలో చోటుచేసుకున్న బాంబు దాడిలో ఇద్దరు పోలీసులు సహా ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఇక నేటి ఉదయం ఏకంగా అప్ఘన్ రాజధాని కాబూల్ లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్నే ముష్కరులు టార్గెట్ చేశారు. అఫ్ఘన్ ప్రభుత్వం ధ్రువీకరించిన ఈ దాడిలో జరిగిన నష్టానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News