: చంద్రబాబు ఇంట సత్య నాదెళ్ల టిఫిన్!... ఏపీ సర్కారుతో పలు ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్


ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. హైదరాబాదులోని తన నివాసానికి వచ్చిన సత్య నాదెళ్లకు చంద్రబాబు అల్పాహార విందు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన భేటీలో పలు కీలక అంశాలపై వారిద్దరూ చర్చించారు. ఏపీలో పౌర సేవలు, విద్య, వ్యవసాయ రంగాల్లో సహకారం అందించేందుకు సత్య నాదెళ్ల అంగీకరించారు. ఈ మేరకు ఏపీ సర్కారుతో ఒప్పందాలు చేసుకునేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన చంద్రబాబును కోరారు.

  • Loading...

More Telugu News