: మోదీ ఇచ్చిన తలపాగాతో మెరిసిన నవాజ్... స్నేహానికి షరీఫ్ విలువిచ్చారన్న పీఎంఎల్ఎన్


మొన్న క్రిస్మస్ నాడు ప్రధాని నరేంద్ర మోదీ రష్యా, ఆఫ్ఘనిస్థాన్ పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో అనూహ్యంగా పాకిస్థాన్ నగరం లాహోర్ లో ఆగారు. అప్పటికప్పుడు ఖరారైన ఈ పర్యటన భారత్, పాక్ లనే కాక ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. నేరుగా లాహోర్ విమానాశ్రయంలో ల్యాండైన మోదీకి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎదురేగి మరీ స్వాగతం పలికారు. ఆ తర్వాత లాహోర్ శివారు ప్రాంతం రాయ్ విండ్ లోని షరీఫ్ ఇంటికి మోదీ వెళ్లారు. అక్కడ షరీఫ్ మనవరాలి పెళ్లికి హాజరయ్యారు. దాదాపు 2 గంటల తర్వాత అక్కడి నుంచి తిరిగివస్తూ ఓ తలపాగాను మోదీ, షరీఫ్ కు బహుమతిగా ఇచ్చి వచ్చారు. మోదీ ఆత్మీయంగా అందించిన సదరు తలపాగాను నవాజ్ షరీఫ్ పక్కన పెట్టేయలేదు. నిన్న తన ఇంటిలో జరిగిన ఓ కార్యక్రమంలో దానిని ధరించి తళుక్కుమన్నారు. దీనిపై షరీఫ్ పార్టీ పీఎంఎల్ఎన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మోదీ అందించిన స్నేహహస్తానికి షరీఫ్ గౌరవమిచ్చారని, ఆ క్రమంలోనే షరీఫ్ సదరు తలపాగాను ధరించారని పేర్కొంది.

  • Loading...

More Telugu News