: అభిమానులు మా వంశాన్ని దీవించి ముందుకు తీసుకెళ్తున్నారు!: నందమూరి హరికృష్ణ
'మా వంశం నుంచి వస్తున్న ప్రతి నటుడిని అభిమానులు ఆదరిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది' అన్నారు నందమూరి హరికృష్ణ. నాన్నకు ప్రేమతో చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ, నందమూరి అభిమానులకు, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ అభిమానులకు, ఆడపడుచులకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ను అభినందించారు. ఈ చిత్రం నయనానందం, శ్రవణానందం, దృశ్యానందంను వందశాతం ఇస్తుందని ఆయన అన్నారు. అభిమానులు తమ వంశాన్ని దీవించి ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. 'మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి. వారి ఆశలను నెరవేర్చాలి' అంటూ అభిమానులకు ఆయన సూచించారు. అనంతరం గత జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు.