: చాలా కాలం తర్వాత జూ.ఎన్టీఆర్ తో నటిస్తున్నాను: రాజీవ్ కనకాల
జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చాలా కాలం తర్వాత 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో తాను నటిస్తున్నానని ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల చెప్పాడు. 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కు ఒక సోదరుడి పాత్రలో తాను నటిస్తున్నట్లు తెలిపాడు. ఈ చిత్ర డైరెక్టరు సుకుమార్ కారణంగానే తనకు ఈ అవకాశం వచ్చిందన్నారు. ఈ చిత్రంలో పాత్రకు తానే కరెక్టని ఆయన మొదటి నుంచి అనే వారని చెప్పారు. ప్రముఖ సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్ వంటి వారితో నటించడం గొప్ప అనుభూతి నిచ్చిందని రాజీవ్ కనకాల అన్నాడు.