: ఇదేమీ అరిష్టం కాదు: శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి
అయుత మహా చండీయాగం పూర్ణాహుతి అయిన తర్వాత మొత్తం పాకలన్నీ కూడా కాల్చేయాలని శాస్రం చెబుతోందని విశాఖపట్టణానికి చెందిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. కానీ, దానికి ముందే పూర్ణాహుతి జరిగిందని, పూర్తిగా ఏ రకమైన అరిష్టాలు లేకుండా.. ముందుగానే భగవంతుడు దాన్ని దహనం చేశాడు తప్ప, ఇదేమి అరిష్టం కాదని.. రాష్ట్రానికి చాలా మేలని.. చాలా గొప్ప చేసిందని స్వామిజీ అన్నారు. ‘విశాఖ పీఠం అమ్మవారి పాదాల సాక్షిగా.. మరీ మరీ చెబుతున్నా.. ఇదే మాత్రం అరిష్టం కాదు’ అని అన్నారు. అయుత చండీయాగం పూర్ణాహుతి పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమం పూర్తిగా అయిపోయినట్లేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అయుత మహా చండీయాగానికి పరమరుద్రుడు, చండీ ఇద్దరూ కూడా చాలా సంతోషించారని, చాలా గొప్పగా ఈ యాగాన్ని కేసీఆర్ జరిపించారని స్వామిజీ అన్నారు.