: తాత్కాలిక గోడలు, కుటీరాలను తొలగించిన పోలీసులు!


అయుత చండీయాగం ప్రధాన హోమ వేదికకు మంటలు అంటుకున్నాయని తెలిసిన వెంటనే అక్కడే పెద్ద సంఖ్యలో ఉన్న భద్రతాదళాలు వెంటనే స్పందించాయి. హోమ వేదిక నుంచి సాధ్యమైనంత ఎక్కువ మందిని రక్షించే దిశగా, అంతకుముందు వేసిన తాత్కాలిక గోడలను ధ్వంసం చేసి, రుత్వికులు, నిర్వాహకులు వేగంగా బయటకు వచ్చేలా చూశారు. ఈ క్రమంలో పలు తాత్కాలిక నిర్మాణాలను పీకేసి మార్గాలను ఏర్పాటు చేశారు. వాస్తవానికి 101 హోమగుండాలను ఏర్పాటు చేసిన యాగశాల సమీపంలోకి కేసీఆర్ సహా బ్రాహ్మణేతరులెవరికీ ప్రవేశం లేకపోయినప్పటికీ, ఆ నిబంధన పక్కకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాయపడ్డ వారెవరికీ ప్రాణాపాయం లేదని వైద్య వర్గాలు వెల్లడించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News