: జనవరి 1 నుంచి కేబుల్ డిజిటలైజేషన్ తప్పనిసరి కానున్న ఏపీ, తెలంగాణ పట్టణాలివే


జనవరి 1 నుంచి కేబుల్ టీవీ డిజిటలైజేషన్ ప్రక్రియ 3వ దశలో భాగంగా పలు పట్టణాల్లో సెట్ టాప్ బాక్సుల ఏర్పాటు తప్పనిసరి కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఏ పట్టణాల్లో డిజిటలైజేషన్ తప్పనిసరన్న విషయంలో ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో డిజిటలైజేషన్ తప్పనిసరిగా అమలు కావాల్సిన పట్టణాల వివరాలివి. ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, పలాస కాశీబుగ్గ, ఇచ్చాపురం, పాలకొండ, రాజాం, ఆముదాల వలస. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, నెల్లిమర్ల. విశాఖపట్నం జిల్లాలోని గ్రేటర్ విశాఖ, యలమంచిలి, నర్సీపట్నం. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి, తుని, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, మండపేట, రామచంద్రాపురం, అమలాపురం, ముమ్మడివరం, గొల్లప్రోలు, ఏలేశ్వరం. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, తణుకు, భీమవరం, నర్సాపూర్, పాలకొల్లు. కృష్ణా జిల్లాలోని విజయవాడ, జగ్గయ్యపేట, నూజివీడు, గుడివాడ, పెడన, నందిగామ, తిరువూరు, ఉయ్యూరు, మచిలీపట్నం. గుంటూరు జిల్లాలోని మాచర్ల, పిడుగురాళ్ల, తాడేపల్లి, మంగళగిరి, సత్తెనపల్లి, వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, గుంటూరు, తెనాలి, పొన్నూరు, బాపట్ల, రేపల్లె. ప్రకాశం జిల్లాలోని చీరాల, ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, కందుకూరు, చీమకుర్తి, అద్దంకి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని గూడూరు, కావలి, నెల్లూరు, వెంకటగిరి, ఆత్మకూరు, నాయుడుపేట. వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేలు, కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, యర్రగుంట్ల, రాయచోటి, రాజంపేట. కర్నూలు జిల్లాలోని కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల, ధోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ. అనంతపురం జిల్లాలోని అనంతపురం, రాయదుర్గం, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, కల్యాణదుర్గం, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, మడకశిర, పామిడి, హిందుపూర్. చిత్తూరు జిల్లాలోని పలమనేరు, తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, మదనపల్లి, పుత్తూరు, పుంగనూరు, చిత్తూరు. తెలంగాణ: ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, ఆదిలాబాద్, కాగజ్ నగర్, బైంసా, నిర్మల్, మందమర్రి, మంచిర్యాల. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు, నిజామాబాద్, బోధన్, కామారెడ్డి. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, రామగుండం, హుస్నాబాద్, జమ్మికుంట, పెద్దపల్లి, జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, వేములవాడ, సిరిసిల్ల. మెదక్ జిల్లాలోని మెదక్, సిద్ధిపేట, జహీరాబాద్, జోగిపేట, గజ్వేల్, సదాశివపేట, సంగారెడ్డి, దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మెదక్ ప్రాంతాలు. రంగారెడ్డి జిల్లాలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రాంతాలు, మేడ్చల్, బడంగ్ పేట్, పెద్ద అంబర్ పేట్, వికారాబాద్, తాండూరు, శంషాబాద్ ఆర్జీఐఏ ప్రాంతం, ఇబ్రహీంపట్నం. మహబూబ్ నగర్ జిల్లాలోని బడేపల్లి, మహబూబ్ నగర్, నారాయణ పేట, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, కొల్లాపూర్, షాద్ నగర్. నల్గొండ జిల్లాలోని భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, దేవరకొండ, విజయపురి నార్త్, మిర్యాలగూడ, కోదాడ, హుజూరాబాద్. వరంగల్ జిల్లాలోని వరంగల్, భూపాలపల్లి, జనగామ, నర్సంపేట, మహబూబాబాద్, పరకాల. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, మధిర.

  • Loading...

More Telugu News