: ఓటేసేందుకు పెద్దగా రావట్లేదు... మందకొడిగా సాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్!
తెలంగాణలోని నాలుగు జిల్లాల్లోని ఆరు స్థానిక కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, అత్యంత మందకొడిగా సాగుతోంది. పోలింగ్ మొదలై రెండు గంటలు గడిచినా, ఓటేసిన స్థానిక ప్రజా ప్రతినిధుల సంఖ్య ఎక్కడా 100 దాటలేదని తెలుస్తోంది. దీంతో ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు హుటాహుటిన ప్రజాప్రతినిధులను పోలింగ్ కేంద్రాలకు తరలించే పనిలో పడ్డారు. ఓటు హక్కును వినియోగించుకోనున్న వారిలో అత్యధికులు క్యాంపు రాజకీయాల్లో భాగంగా వేరే ప్రాంతాల్లో ఏర్పాటైన శిబిరాలకు వెళ్లి, గత రాత్రి, ఈ తెల్లవారుఝామునే ఊర్లకు చేరడంతోనే పోలింగ్ మందకొడిగా ప్రారంభమైందని తెలుస్తోంది.