: 21 మంది ఆప్, 34 మంది అకాలీదళ్ నేతలు కాంగ్రెస్ లో చేరిక
పంజాబ్ లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తం 34 మంది దళ్ నేతలు, 21 మంది ఆప్ నేతలు తమ పార్టీలో చేరినట్టు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ వెల్లడించారు. వీరంతా సుమన్, షంగూర్ జిల్లాలకు చెందిన వారని అన్నారు. కాగా, ఇటీవలే కాంగ్రెస్ నేత సుఖ్ పాల్ ఖారియా ఆప్ లో చేరిన సంగతి తెలిసిందే. సుఖ్ పాల్ వెళ్లడంతో తమకేమీ నష్టం లేదని అమరీందర్ తెలిపారు. వీరందరి చేరికతో కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ లో బలం మరింతగా పెరిగిందని అన్నారు.