: పెళ్లి చేసుకుంటానని మోసం.. ఐపీఎస్ అధికారిపై కేసు నమోదు!


యూపీఎస్సీ పరీక్షలు రాయాలనుకున్న ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసానికి పాల్పడ్డ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు చెందిన బాధితురాలు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇండోర్ జిల్లా ఎస్పీ త్రిపాఠి తెలిపిన వివరాల ప్రకారం, 2013 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి లోహిత్ మతానీకి బాధితురాలు యూపీఎస్సీ పరీక్షలు రాసే సమయంలో ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. పరీక్షలకు ఏవిధంగా ప్రిపేరవ్వాలో ఆమెకు చెబుతానని చెప్పాడు. క్రమంగా వారి పరిచయం బలపడింది. వాళ్లిద్దరూ కలసి ఎక్కడికెళ్లినా తనకు కాబోయే భార్య అని కొన్నిసార్లు, భార్య అని మరికొన్నిసార్లు ఆ అమ్మాయిని పరిచయం చేసేవాడు. ఈ క్రమంలో ఈ సంవత్సరం ఆగస్టు నెలలో టుకోగంజ్ ప్రాంతంలోని ఓ హోటల్ కు ఆమెను తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు త్రిపాఠి చెప్పారు. సదరు ఐపీఎస్ అధికారిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News