: ఏటేటా పెరుగుతున్న మన ఎంపీల ప్రయాణాల ఖర్చు!
మన ఎంపీలు ప్రయాణాల పేరిట ఖర్చుపెడుతున్న సొమ్మెంతో తెలుసా? సుమారు రూ.150 కోట్లు. రెండేళ్ల క్రితం (2013-14) మన ఎంపీలు రవాణా ఖర్చుల కింద ఏకంగా రూ.147.38 కోట్లు ఖర్చుపెట్టారు. గతేడాది (2014-15)లో ఈ ఖర్చు కాస్తంత తగ్గి రూ.135.8 కోట్లుగా తేలింది. ఇక ఈ ఏడాది (2015-16) ఏ మేర ఉంటుందోనన్న అంశంపై సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖర్చంతా కేవలం దేశీయ ప్రయాణాల కోసం మన ఎంపీలు వెచ్చించిందే సుమా. ఇక విదేశీ ప్రయాణాల కోసం మనోళ్లు ఖర్చు చేసేన మొత్తం తెలిస్తే షాక్ కు గురి కాక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం రూ.50 వేలుగా ఉన్న ఎంపీల బేసిక్ వేతనం త్వరలోనే డబులై లక్ష రూపాయలకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో అసలు ఎంపీలు ప్రయాణ ఖర్చుల కింద ఎంతమేర ఖర్చు పెడుతున్నారన్న విషయంపై వేద్ పటేల్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన పిటిషన్ కు స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది.