: ‘అనంత’లో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు దుర్మరణం, మరో ముగ్గురికి తీవ్రగాయాలు


రోడ్డు ప్రమాదాలకు ఏపీలోని అనంతపురం జిల్లా కేరాఫ్ అడ్రెస్ గా మారుతోంది. హైదరాబాదు-బెంగళూరు జాతీయ రహదారి జిల్లా మీదుగానే వెళుతున్న నేపథ్యంలో ఆ జిల్లాలో ఇటీవల ప్రమాదాల సంఖ్య మరింతగా పెరిగింది. నేటి తెల్లవారుజామున ఆ జిల్లాలోని ముదిగుబ్బ మండలం సంకేపల్లి వద్ద చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సంకేపల్లి వద్ద ఎదురుగా వస్తున్న సిమెంట్ లోడు లారీని, తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం కర్ణాటక భక్తులను తీసుకెళుతున్న ఓమ్ని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కర్ణాటకలోని గంగావతికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఇక గాయపడ్డ ముగ్గురు కూడా మృతుల కుటుంబసభ్యులే. రక్త గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ ముగ్గురిని పోలీసులు హుటాహుటిన అనంతపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News