: యాగాలు చేసినా తగిలే పాపం తగలకపోదు: కేసీఆర్ పై కోమటిరెడ్డి నిప్పులు


ఓవైపు తెలంగాణలో ప్రతిపక్షాల వారిని మభ్యపెట్టి తమ పార్టీలో చేర్చుకుంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తన పాపాలను కడుక్కునేందుకే యజ్ఞయాగాలు చేస్తున్నారని, ఎన్ని యాగాలు చేసినప్పటికీ, తగిలే పాపం తగలకుండా పోదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిప్పులు చెరిగారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడని, ఒకవేళ అతను గెలవకుంటే, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, టీఆర్ఎస్ తన సవాల్ ను స్వీకరించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడ్డ తమవంటి నేతలపైనే కేసీఆర్ కక్షగట్టాడని ఆరోపించారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను టీఆర్ఎస్ పార్టీ భయభ్రాంతులకు గురి చేస్తోందని కాంగ్రెస్ నేత డీకే అరుణ ఆరోపించారు. సంఖ్యా బలం లేకున్నా, రెండు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించిందని గుర్తు చేసిన ఆమె, దిగజారుడు రాజకీయాలు చేస్తూ, వారిని గెలిపించుకునేందుకు అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News