: ఇండియాలో అతిపెద్ద ఆన్ లైన్ స్టోర్ గా అవతరించిన అమెజాన్


దేశవాళీ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, ఈబే కంపెనీలను అధిగమించి, ఇండియాలో అతిపెద్ద ఆన్ లైన్ స్టోర్ గా అమెజాన్ అవతరించింది. 2015లో సరాసరిన రోజుకు 55 వేల కొత్త ఉత్పత్తులను తమ స్టోర్ లో జోడించామని, అత్యధికులు దర్శించిన ఈ-కామర్స్ వెబ్ సైట్ గా నిలిచామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సైట్ కు వచ్చిన ట్రాఫిక్ లో 70 శాతం మొబైల్ మాధ్యమంగానే వచ్చిందని పేర్కొంది. "2015 సంవత్సరం సంస్థను ఉన్నత స్థితికి చేర్చింది. కస్టమర్ల నుంచి, అమ్మకం దారుల నుంచి మంచి మద్దతు వచ్చింది. అమ్మకందారుల సంఖ్య 250 శాతం పెరిగింది" అని అమెజాన్ భారత మేనేజర్ అమిత్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. సైట్ కు వచ్చిన ఆర్డర్లలో 65 శాతం ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి వచ్చాయని, తక్కువ ధరలు, వేగవంతమైన డెలివరీ తమ విజయలక్ష్యమని, దీనికితోడు అధిక డివిడెండ్లు ఇవ్వడం కూడా అమెజాన్ పై కస్టమర్లలో నమ్మకాన్ని పెంచిందని తెలిపారు. భవిష్యత్తులో ఇండియాలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నామని, వీటిల్లో అత్యధికం గిడ్డంగుల నిర్మాణం నిమిత్తం కేటాయించనున్నామని అమిత్ అగర్వాల్ వివరించారు.

  • Loading...

More Telugu News