: క్యాన్సర్‌ బాలికపై జన్యు చికిత్సల ప్రయోగాలు


మెదడు క్యాన్సర్‌ సోకిన ఓ పన్నెండేళ్ల బాలికపై డాక్టర్లు జన్యుపరమైన చికిత్సలను ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే రెండు ఆపరేషన్లు, 30 సార్లు రేడియేషన్‌ ఇచ్చినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోవడం వల్ల.. ఆమె మెదడు క్యాన్సర్‌ నివారణకు సంప్రదాయ చికిత్సలు కాకుండా.. .జన్యుపరమైన చికిత్స పద్ధతుల్ని అవలంబిస్తున్నారు. దీనివలన హై డోసేజీల్లో ఇచ్చే కీమో థెరపీని బాలిక తట్టుకోగలదని వైద్యులు భావిస్తున్నారు.

బాల్యంలో మెదడు క్యాన్సర్‌ అనేది చాలా అరుదైన జబ్బు. ఆస్ట్రేలియాలో జన్యుచికిత్స దీనికి నివారణ కాగలదేమోనని తాజా ప్రయోగం జరుగుతోంది. సిడ్నీలోని వెస్ట్‌మీడ్‌ ఆస్పత్రి వైద్యులు దీన్ని పరిశీలిస్తున్నారు. ఈ బాలికకు ఆపరేషన్‌ సక్సెస్‌ అయితే.. వివిధ కణతులపై చికిత్సకు ఇదే మార్గం మెరుగు కాగలదని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News