: సీమలో బలిజ కులస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నాం: లోకేశ్
రాయలసీమలో బలిజ సామాజికవర్గానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజికవర్గానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామాంజనేయులు, ఇతర డైరెక్టర్లు లోకేశ్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కాపు కార్పొరేషన్ ను బలోపేతం చేయాల్సిన బాధ్యత ఈ కార్పొరేషన్ పై ఉందని లోకేశ్ అన్నారు. రాయలసీమలో బలిజలకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. కాపు కార్పొరేషన్ కు అవసరమైన నిధుల కేటాయింపు జరుగుతుందని తెలిపారు.