: అమలులోకి వచ్చిన కొత్త రేట్లు... రైలు ప్రయాణం మరింత భారం!
పెరిగిన రైల్వే టికెట్ చార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం అప్పటికప్పుడు ప్రయాణాలు పెట్టుకున్న వారు రైల్లో తత్కాల్ టికెట్ కొని ప్రయాణించాలంటే అదనంగా జేబు నుంచి డబ్బు వదిలించుకోవాల్సిందే. తత్కాల్ చార్జీలను పెంచుతూ ఇప్పటికే ప్రకటన వెలువరించిన భారతీయ రైల్వే నేటి నుంచి వాటిని అమలు చేస్తోంది. ఇప్పటి వరకూ స్లీపర్ క్లాసులో బెర్తుకు తత్కాల్ విధానంలో రూ. 175 వసూలు చేస్తుండగా, అది రూ. 200కు పెరిగింది. థర్డ్ ఏసీ చార్జీలు రూ. 400 వరకూ పెరగగా, సెకండ్ ఏసీ చార్జీలు గరిష్ఠంగా రూ. 500 వరకూ పెరిగాయి. రైల్వే టికెట్ల పెంపుపై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.