: ఇద్దరు యువతులకు ఐఎస్ బహిరంగ మరణశిక్ష!
ఖలిఫాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ ఇద్దరు టీనేజ్ యువతులకు ఐఎస్ఐఎస్ బహిరంగ ఉరిశిక్ష విధించింది. ఈ సంఘటన ఇరాక్ లోని మోసుల్ నగరంలో చోటుచేసుకుంది. షరియా కోర్టు ఆదేశాల మేరకు ఆ యువతులకు బహిరంగంగా ఉరిశిక్ష అమలు చేసినట్టు సమాచారం. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.