: శ్రీకాకుళంలో స్వల్ప భూ ప్రకంపనలు
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. పొందూరు మండలం రోలుగ, కనిమెట్ల ప్రాంతాల్లో భూమి కంపించింది. నాలుగు సెకన్ల పాటు వచ్చిన ప్రకంపనలతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.