: గోదావరి జలాలతో తెలంగాణలో కరవును తరిమికొడతాం: మంత్రి ఈటల


గోదావరి నదీ జలాలతో తెలంగాణ రాష్ట్రంలో నెలకొంటున్న కరవు పరిస్థితులను తరిమికొడతామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి తరువాత విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి మిడ్ మానేరు వరకు వచ్చే సంవత్సరం చివరకు నీటిని పంపింగ్ చేస్తామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ప్రధానంగా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించిందని వివరించారు. తద్వారా తెలంగాణ రాష్ట్రం నుంచి కరవును తరిమివేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు.

  • Loading...

More Telugu News