: ఇకపై 'ఐసీఐసీఐ' బ్యాంక్ వెబ్ సైట్ లో రైల్ టికెట్ల బుకింగ్


రైల్ టికెట్లను ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లోనే కాకుండా ఇక నుంచి 'ఐసీఐసీఐ' బ్యాంక్ వెబ్ సైట్ లో కూడా బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. ఇందుకోసం ఆ బ్యాంక్ ఐఆర్ సీటీసీతో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్, ప్రీపెయిడ్ డిజిటల్ వాలెట్ ద్వారా రైల్వే ఈ -టికెట్లను వినియోగదారులు బుక్ చేసుకోవచ్చునని బ్యాంక్ వెల్లడించింది. వినియోగదారులు ముందుగా ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత బ్యాంక్ వెబ్ సైట్ ద్వారా టికెట్ ను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ సేవలను ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులతో పాటు ఇతర బ్యాంక్ కస్టమర్లు కూడా వినియోగించుకోవచ్చు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరపవచ్చు. రైళ్ల పూర్తి సమాచారం తెలుసుకోవడంతో బాటు, ఈ-టికెట్ బుకింగ్ లేదా రద్దు చేసుకోవచ్చని, పీఎన్ఆర్ స్టేటస్ ను సైతం తమ వెబ్ సైట్ ద్వారా తెలుసుకునే వీలుందని ఐసీఐసీఐ వివరించింది.

  • Loading...

More Telugu News