: మోదీకి కానుకగా మహాత్ముడి డైరీలో ఓ పేజీ


రష్యా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విలువైన, అరుదైన కానుక ఇచ్చారు. మాస్కోలో ఈ ఉదయం వారిద్దరూ భేటీ అయిన సమయంలో మహాత్మాగాంధీ స్వహస్తాలతో రాసుకున్న డైరీలోని ఓ పేజీని తనకు బహుమతిగా ఇచ్చినట్టు మోదీ ట్విట్టర్ లో తెలిపారు. ఆ బహుమతి సమర్పించినందుకు గాను పుతిన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. అదే సమయంలో పుతిన్ కు భారత్ తరపున 18వ శతాబ్దానికి చెందిన బెంగాల్ కత్తిని ప్రదానం చేసినట్లు ప్రధాని వెల్లడించారు.

  • Loading...

More Telugu News