: రేపటి నుంచి నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు...డబ్బుకు ఇబ్బందే!


రేపటి నుంచి నాలుగు రోజులపాటు బ్యాంకులకు సెలవులు. గురువారం ముస్లింలకు పవిత్రమైన మిలాద్ ఉన్ నబీ కాగా, శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్, శని, ఆది వారాలు సాధారణ సెలవు దినాలు. వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంకులకు సెలవు రావడంతో డబ్బుకు తీవ్ర ఇబ్బంది తలెత్తే అవకాశం కనబడుతోంది. పెద్ద ఎత్తున లావాదేవీలు నిర్వహించే వ్యాపారులకు ఇది కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం వరుసగా రెండు రోజులు సెలవు లభిస్తే మూడో రోజు అదనపు భత్యం ఇచ్చి బ్యాంకులు తెరిచే అవకాశం ఉందని, అలా కొన్ని బ్యాంకులు తెరుచుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే మొబైల్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో నాలుగు రోజుల సెలవుపై రిజర్వు బ్యాంకు స్పందించే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News