: రాజ్ నాథ్ కు చేదు అనుభవం... సైనిక కుటుంబాలే ఎందుకేడుస్తున్నాయని నిలదీసిన ఆర్మీ కుటుంబం
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు నేటి ఉదయం చేదు అనుభవం ఎదురైంది. నిన్న ఢిల్లీలో కూలిన బీఎస్ఎప్ విమాన దుర్ఘటనలో చనిపోయిన వారికి నివాళి అర్పించేందుకు వెళ్లిన ఆయన, అక్కడ తనకు ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. నిన్నటి ఘటనలో విమానంలో ఉన్న పది మంది బీఎస్ఎఫ్ సాంకేతిక నిఫుణులు మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమానంలో లోపం ఉందని పైలట్ సమాచారం అందించినా, 'ఏమీ కాదు, ముందుకు దూసుకెళ్లండి' అంటూ ఏటీసీ నుంచి ఆదేశాలు వచ్చాయన్న వార్తలు వినవస్తున్నాయి. ఈ క్రమంలో నేటి ఉదయం మృతుల వద్దకు వెళ్లిన రాజ్ నాథ్ ను చనిపోయిన ఓ జవాను కుటుంబ సభ్యులు నిలదీశారు. ‘‘ప్రతిసారీ సైనికుల కుటుంబాలే ఎందుకు ఏడుస్తున్నాయి?’’ అని నిలదీసిన సదరు కుటుంబానికి జవాబు చెప్పేందుకు రాజ్ నాథ్ వద్ద సమాధానమే లేకపోయింది.