: రామ మందిరంపై రాజ్యసభలో రగడ... రహస్యంగా నిర్మాణం జరుగుతోందన్న విపక్షాలు
అయోధ్య రామ మందిరంపై రాజ్యసభ అట్టుడికింది. అయోధ్యకు శిలలను (రాళ్లు) తరలించడంపై విపక్షాలు గందరగోళం సృష్టించాయి. కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీలు రహస్యంగా రామ మందిర నిర్మాణాన్ని చేపట్టాయని ఆరోపించాయి. ఇదే సమయంలో సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ సభ్యుల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ వల్లే అయోధ్యకు రహస్యంగా శిలల తరలింపు జరుగుతోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఎస్పీ నేతలు భగ్గుమన్నారు. మరోవైపు అధికారపక్షంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను రామ జన్మభూమి న్యాస్ ఖండించింది. అయోధ్యకు శిలల తరలింపు రెగ్యులర్ గా జరిగే కార్యక్రమమే అని పేర్కొంది.