: అమెరికా ‘విటియోస్’ను చేజిక్కించుకున్న విప్రో


దేశీయ సాఫ్ట్ వేర్ దిగ్గజం విప్రో... మరింతగా విస్తరిస్తోంది. విశ్వవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న విప్రో, తనకు అనుకూలమైన వివిధ సంస్థల టేకోవర్ కు పకడ్బందీగా కార్యాచరణ చేసింది. ఇందులో భాగంగా అవుట్ సోర్సింగ్ లో పేరెన్నికగన్న అమెరికా సంస్థ ‘విటియోస్’ను టేకోవర్ చేస్తోంది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అమెరికా సహా యూరోప్, ఆసియా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న విటియోస్ 400 మంది ఉద్యోగులతో సత్తా చాటుతోంది. ఈ కంపెనీని టేకోవర్ చేసేందుకు రంగంలోకి దిగిన విప్రో 130 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు సిద్ధపడింది. విటియోస్ టేకోవర్ మార్చి 31తో ముగిసే త్రైమాసికంలోగా పూర్తి కానుందని విప్రో ఆర్థిక విభాగం ప్రెసిడెంట్ షాజీ ఫరూక్ చెప్పారు.

  • Loading...

More Telugu News